కిరాక్ రామ్ నెక్స్ట్ చిత్రం టైటిల్ ఏంటో తెలుసా ?

Published on Oct 28,2019 06:05 PM

ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో సంచలన విజయం అందుకున్న రామ్ తాజాగా తన 18 వ చిత్రాన్ని ప్రకటించాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ నటించనున్న చిత్రానికి '' రెడ్ '' అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేసారు. కొద్దిసేపటి క్రితం రెడ్ చిత్రం లోగోని అలాగే రామ్ లుక్ ని రివీల్ చేసారు ఆ చిత్ర బృందం. ఈ రెడ్ లుక్ లో రామ్ ఊర మాస్ లా కనబడుతున్నాడు. ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిన సక్సెస్ తో రామ్ ఈ రెడ్ ప్రయోగం చేస్తున్నాడు.

ఇక ఈ చిత్ర దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ రెండు చిత్రాల్లో నటించగా '' నేను శైలజ '' పెద్ద హిట్ అయ్యింది , '' ఉన్నది ఒకటే జిందగీ '' చిత్రం మాత్రం ఓ మాదిరిగా ఆడింది. ఇక ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఈ రెడ్. ఆ రెండు చిత్రాలు ఒకరకమైతే ఈ రెడ్ మరో రకం అన్నమాట.