ఆపని తప్పు కాదంటున్న హాట్ భామ

Published on Feb 13,2020 03:25 PM

పెళ్లికి ముందు కాబోయే వాడితో తిరిగితే తప్పు ఎలా అవుతుందని , అది తప్పు కానేకాదని అంటోంది హాట్ భామ కియారా అద్వానీ. కాబోయే వాడు నచ్చితే అతడి గురించి మరింతగా అర్ధం చేసుకోవడానికి డేటింగ్ కి వెళితే తప్పేంటి ? అని ప్రశ్నిస్తోంది కియారా అద్వానీ. అయితే అది ప్రేమించిన వాళ్లకు మాత్రమే నాకు కాదు సుమా ! ఎందుకంటే నేను ఎవరినీ ప్రేమించడం లేదు నాకు అంత తీరిక లేదని అంటోంది. ప్రస్తుతం నా దృష్టి అంతా సినిమాల మీదే ఉందని అంటోంది కియారా అద్వానీ.

తాజాగా ఈ భామ మళ్ళీ తెలుగులో నటించడానికి సిద్ధం అవుతోంది. అది కూడా మళ్ళీ మహేష్ బాబు సరసనే అని తెలుస్తోంది. భరత్ అనే నేను చిత్రంలో నటించి సంచలన విజయాన్ని అందుకున్న కియారా అద్వానీ ఆ తర్వాత చరణ్ సరసన వినయ విధేయ రామ చిత్రంలో నటించింది. ఆ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది కానీ అది డిజాస్టర్ కావడంతో మళ్ళీ ఈ భామకు ఛాన్స్ లు రాలేదు తెలుగులో. కట్ చేస్తే మహేష్ బాబు మరోసారి ఈ భామకు ఛాన్స్ ఇస్తున్నాడట.