ఎన్టీఆర్ కు ముద్దులు ఇచ్చిన కుష్భు

Published on Jan 02,2020 06:23 PM
జూనియర్ ఎన్టీఆర్ అంటే విపరీతమైన ఇష్టం సీనియర్ నటి కుష్భు కు దాంతో జూనియర్ ఎన్టీఆర్ కనబడగానే ఫ్లైయింగ్ కిస్ లు ఇస్తూ రచ్చ రచ్చ చేసింది, అంతేనా ....... ఎన్టీఆర్ ఫోటో కనబడగానే వీర లెవల్లో రెచ్చిపోయింది కుష్భు. ఈ తతంగమంతా ఈటివి లో ఆలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సాగింది. అలీ కుష్భు ని ఇంటర్వ్యూ కి పిలవగా తనకు ఇష్టమైన హీరోలు జూనియర్ ఎన్టీఆర్ , తమిళంలో అయితే అరవింద్ అని చెప్పింది. ఇక ఎన్టీఆర్ కనబడగానే పూనకం వచ్చినట్లు ఊగిపోయింది. అంతేనా ఎన్టీఆర్ ని కలిసి ఆటోగ్రాఫ్ తీసుకోవడమే కాకుండా వాళ్ళింటికి వెళ్లి భోజనం కూడా చేసిందట.

90 వ దశకంలో గ్లామర్ హీరోయిన్ గా ఓ ఊపు ఊపేసింది టోటల్ దక్షినాదిని. తెలుగుతో పాటుగా తమిళ చిత్రాల్లో కూడా నటించింది ఈ భామ. అప్పట్లో ఈ భామకు గుడి కట్టించారు కుష్భు ని అభిమానించే వాళ్ళు. అయితే తనకు అభిమానులను ఎంకరేజ్ చేయడం అంటే ఇష్టం లేదని ఎందుకంటే ఎంతో కస్టపడి సంపాదించిన డబ్బుని తమ అభిమాన నటీనటుల కోసం ఖర్చుపెడుతుంటారు అది నాకు నచ్చదు అందుకే నేను అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయలేదని పేర్కొంది కుష్భు. ఈ భామ కోసం ఇప్పటికి కూడా అభిమానంతో ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు కానీ ఈ భామకు మాత్రం ఎన్టీఆర్ అంటే పూనకం వస్తోంది మరి.