కోర్టు ఆదేశాలతో షూటింగ్ ఆగిపోయిన కేజీఎఫ్ 2

Published on Aug 30,2019 10:27 AM

కన్నడ స్టార్ హీరో యష్ నటించిన కేజీఎఫ్ చాఫ్టర్ 1 సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. దాంతో ఆ చిత్రానికి సీక్వెల్ గా కేజీఎఫ్ 2 చిత్రాన్ని చేస్తున్నారు దర్శకులు ప్రశాంత్ నీల్. కాగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కోలార్ ఫీల్డ్స్ వద్ద గల సైనైడ్ హిల్స్ లో షూటింగ్ జరుపుకుంటోంది. సైనైడ్ హిల్స్ లో భారీ యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు దర్శకులు ప్రశాంత్ నీల్. 

అయితే అక్కడ షూటింగ్ చేస్తుండటం వల్ల పర్యావరణం దెబ్బతింటోందని , తక్షణం షూటింగ్ ఆపేయాలంటూ ఓ వ్యక్తి కోర్టుకెక్కడంతో పర్యావరణం దెబ్బతింటోందన్న అభిప్రాయంతో ఏకీభవిస్తూ తక్షణం షూటింగ్ ఆపేయాల్సిందిగా బెంగుళూర్ కోర్టు తీర్పు వెలువరించింది. దాంతో కేజీఎఫ్ 2 షూటింగ్ ఆగిపోయింది. ఇక కోలార్ ఫీల్డ్స్ లోని సైనైడ్ హిల్స్ లాంటి ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ షూటింగ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం.