కేజీఎఫ్ 2 రిలీజ్ అయ్యేది ఎప్పుడో తెలుసా ?

Published on Sep 09,2019 11:06 AM

కన్నడ స్టార్ హీరో యష్ నటించిన కేజీఎఫ్ చాప్టర్ 1 సంచలన విజయం సాధించడంతో దానికి సీక్వెల్ గా కేజీఎఫ్ 2 తీస్తున్న విషయం తెలిసిందే. కాగా సినిమా ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యేది ఎప్పుడో తెలుసా ...... 2020 ఏప్రిల్ లో.
అసలు కేజీఎఫ్ 2 ని ఈ ఏడాదిలోనే విడుదల చేయాలనీ అనుకున్నారు కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో వచ్చే ఏడాదికి వాయిదాపడింది. 2020 వేసవిలో ఏప్రిల్ లో విడుదల చేయాలనీ అనుకుంటున్నారు. కేజీఎఫ్ తో యష్ కు ఊహించని స్టార్ డం వచ్చింది దాంతో ఈ రెండో పార్ట్ పై భారీగా ఆశలు పెట్టుకున్నాడు. ఇక ప్రశాంత్ నీల్ కూడా ఈ సినిమాతో టాలీవుడ్ సూపర్ స్టార్ లను టార్గెట్ చేస్తున్నాడు. కేజీఎఫ్ 2 తర్వాత తెలుగులో సినిమాలు చేయాలనే ఆలోచనతో ఉన్నాడు దర్శకులు ప్రశాంత్ నీల్.