కేజీఎఫ్ డైరెక్టర్ సినిమా ఎన్టీఆర్ తోనా మహేష్ తోనా

Published on Sep 16,2019 07:07 PM

కేజీఎఫ్ చిత్రంతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తాజాగా కేజీఎఫ్ 2 తీస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆ సినిమా తర్వాత ఈ దర్శకుడు తన తదుపరి సినిమాని మహేష్ బాబు తో చేయనున్నాడా ? లేక జూనియర్ ఎన్టీఆర్ తో చేయనున్నాడా ? అన్న ఆసక్తి నెలకొంది ఎందుకంటే ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ని కలిసిన ప్రశాంత్ నీల్ ఇటీవల మహేష్ బాబు ని సైతం కలిసాడు దాంతో భారీ ఎత్తున ఊహాగానాలు చెలరేగాయి.

కేజీఎఫ్ 2 చిత్రాన్ని వచ్చే ఏడాది 2020 వేసవిలో విడుదల చేయనున్నారట! ఆ సినిమా తర్వాత తెలుగులో సినిమా చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడు అయితే అది మహేష్ బాబు తో ఉంటుందా ? లేక జూనియర్ ఎన్టీఆర్ తో ఉంటుందా ? అన్నది ప్రశ్నగా మారింది. మహేష్ బాబు ఈ డిసెంబర్ నెలాఖరు వరకు ఫ్రీ అవుతాడు , ఎన్టీఆర్ అయితే జూలై రావాల్సిందే. మరి ఈ ఇద్దరు హీరోలలో ప్రశాంత్ నీల్ ఎవరితో సినిమా చేయనున్నాడో?