కేజీఎఫ్ సీక్వెల్ స్టార్ట్ అయ్యింది

Published on Mar 13,2019 03:25 PM

కన్నడ స్టార్ హీరో నటించిన కేజీఎఫ్ చాప్టర్ 1 గత ఏడాది విడుదలై సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే . కాగా ఈరోజు కేజీఎఫ్ చాప్టర్ 2 ప్రారంభమైంది . విజయనగర లోని కోదండరామ ఆలయంలో పూజా కార్యక్రమాలతో రెండో పార్ట్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది . ఈ పూజా కార్యక్రమాలలో హీరో యష్ తో పాటుగా ఆ చిత్ర బృందం పాల్గొంది . 

కేజీఎఫ్ చాప్టర్ 1 తెలుగు , తమిళ , కన్నడ , హిందీ బాషలలో రిలీజ్ అయ్యింది . ఇక ఈ సినిమా 250 కోట్ల వసూళ్ల ని సాధించింది ప్రపంచ వ్యాప్తంగా . ఇక కన్నడంలోనే 100 కోట్లకు పైగా వసూల్ చేసి చరిత్ర సృష్టించింది కేజీఎఫ్ . ఇక కేజీఎఫ్ 2 చిత్రాన్ని 2020 లో రిలీజ్ చేయనున్నామని ప్రకటించారు ఆ చిత్ర బృందం .