వాయిదాపడిన కీర్తి సురేష్ సినిమా

Published on Feb 11,2019 03:44 PM

మహానటి చిత్రంతో తెలుగు  ప్రేక్షకుల గుండెల్లో మహానటి సావిత్రి గా నిలిచిపోయిన భామ కీర్తి సురేష్ . తాజాగా ఈ భామ తెలుగులో ఓ సినిమా చేయడానికి అంగీకరించింది ...... సినిమా కూడా ప్రారంభం అయ్యింది . అయితే ఈనెల 14 నుండి రెగ్యులర్ షూటింగ్ జరగాల్సి ఉండే కానీ అనూహ్యంగా వాయిదాపడిందని తెలుస్తోంది . 

నరేంద్ర అనే కొత్త దర్శకుడు ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నాడు . రెగ్యులర్ షూటింగ్ ని వాయిదా వేసిన టీమ్ ఎప్పటి నుండి అన్నది మాత్రం ఇంకా వెల్లడించలేదు . కీర్తి సురేష్ హోమ్లీ గా కనిపించినప్పటికీ గ్లామర్ పాత్రలు అంటే ఇష్టమట ఈ భామకు కానీ దర్శక నిర్మాతలు మాత్రం కీర్తికి గ్లామర్ పాత్రలు ఇవ్వాలంటే భయపడుతున్నారు పాపం . పైగా మహానటి తర్వాత అస్సలు ఇచ్చే సాహసం చేయరు మరి .