రాజమౌళిపై సంచలన వ్యాఖ్యలు చేసిన కీరవాణి

Published on Apr 25,2020 08:13 AM
ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి పై సంచలన వ్యాఖ్యలు చేసాడు సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి. రాజమౌళి కీరవాణికి తమ్ముడు అన్న సంగతి తెలిసిందే. వీళ్లది ఉమ్మడి కుటుంబం కావడంతో దాదాపు 30 మందికి పైగానే ఉంటారు ఇంట్లో. ఇక ఏ పనులు చేసినా కలిసే చేస్తుంటారు అందుకే వీళ్లది కూడా ఓ బాహుబలి ఫ్యామిలీ అని అనొచ్చు. బాహుబలి కోసమే కాకుండా రాజమౌళి తీసే సినిమాలకు అన్నింటికి ఈ కుటుంబంలోని వాళ్ళు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు.

ఇక కీరవాణికి రాజమౌళి మీద ఉన్న అభియోగం ఏంటో తెలుసా ....... కొన్ని తనకు నచ్చిన సినిమాలు చూడమని పెద్ద లిస్ట్ ఇచ్చాడట కీరవాణి , అయితే వాటిని ఇంతవరకు చూడలేదట. పైగా పిల్లలు చూసే కొన్ని సినిమాలను చూస్తుంటాడని అలాగే తనతో కలిసి సినిమా చూడడని అందుకే రాజమౌళి మీద కోపం అని అంటున్నాడు కీరవాణి. అయితే ఏదైనా పని అనుకుంటే మాత్రం అది పూర్తయ్యే వరకు వదిలి పెట్టేరకం కాదని కూడా అంటున్నాడు కీరవాణి. తాజాగా వీళ్ళ కాంబినేషన్ లో ఆర్ ఆర్ ఆర్ వస్తున్న విషయం తెలిసిందే.