కేసీఆర్ బయోపిక్ రిలీజ్ కు రెడీ

Published on Mar 13,2019 12:35 PM

తెలుగునాట బయోపిక్ ల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో కేసీఆర్ బయోపిక్ కూడా రిలీజ్ కి సిద్ధమైంది. తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ బయోపిక్ గా తెరకెక్కిన ఉద్యమ సింహం ఈనెల 29 న విడుదలకు సిద్ధమవుతోంది. అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వంలో కల్వకుంట్ల నాగేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రూపొందిన ఉద్యమ సింహం ట్రైలర్ ని కల్వకుంట్ల కవిత పుట్టినరోజు సందర్భంగా ఈరోజు విడుదల చేశారు. 

అయితే ఇది ఉద్యమ కాలం నాటి సినిమా , కానీ రాష్ట్రం సిద్దించిన తర్వాత అందునా ఐదేళ్ల తర్వాత ఆ ఉద్యమ నేపథ్యంలో రూపొందిన చిత్రం ఈ ఉద్యమ సింహం. మరి ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న గా మారింది.