మహేష్ సరసన కత్రినాకైఫ్ నటించడం లేదట

Published on Jan 31,2019 03:07 PM

మహేష్ బాబు తాజాగా మహర్షి చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా కంప్లీట్ అయ్యాక సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్నాడు. వేసవిలో ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఆ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ భామ కత్రినాకైఫ్ ని ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి . కట్ చేస్తే కత్రినాకైఫ్ నేను మహేష్ సినిమాలో నటించడం లేదు అని తేల్చి చెప్పింది. 

నేను మహేష్ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయన్న విషయం నాకు తెలిసింది అయితే ఆ సినిమా కోసం నన్నెవరు అడగలేదు , అలా వస్తున్న వార్తలన్నీ అబద్ధాలే అంటూ చెప్పేసింది కత్రినాకైఫ్ . ఇంతకుముందు కత్రినాకైఫ్ తెలుగులో రెండు చిత్రాల్లో నటించింది. అయితే మల్లీశ్వరి మాత్రమే హిట్ అయ్యింది.