ఇలియానా లిప్ లాక్ కావాలంటున్న ఆర్ ఎక్స్ 100 హీరో

Published on Jan 21,2019 04:04 PM

ఆర్ ఎక్స్ 100 చిత్రంతో సంచలనం సృష్టించిన హీరో కార్తికేయ తాజాగా మరో సంచలనానికి తెరలేపాడు . హాట్ భామ ఇలియానా తో లిప్ లాక్ చేయాలనే ఆశ ఉందని , అది ఎప్పటికి నెరవేరుతుందో ఏమో ! అంటూ తన మనసులోని మాటని బయట పెట్టాడు ఈ కుర్ర హీరో . బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన ఆర్ ఎక్స్ 100 చిన్న చిత్రంగా వచ్చి సంచలన విజయం సాధించింది . దాంతో ఈ హీరో తాజాగా హిప్పీ అనే చిత్రంలో నటిస్తున్నాడు . 

అయితే తనకు ఇలియానా అంటే చాలా ఇష్టమని , ఇలియానా లిప్ లాక్ కావాలని మారాం చేస్తున్నాడు . అయితే ఇలియానా పెద్ద హీరోలకే లిప్ లాక్ ఇవ్వలేదు ఇక ఈ కుర్ర హీరోకు ఇస్తుందా ? అయినా ఆండ్రు అనే లవర్ తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతోంది ఇలియానా . అంతేకాదు పెళ్లి అయ్యిందో లేదో తెలీడం లేదు కానీ భార్యాభర్తల లాగే జీవిస్తున్నారు కలిసి .