చావుకబురు చల్లగా చెప్పిన కార్తికేయ

Published on Dec 15,2019 04:10 PM

హీరో కార్తికేయ కొత్త చిత్రం '' చావుకబురు చల్లగా ''. ఆర్ ఎక్స్ 100 చిత్రంతో హీరోగా పరిచయమైన కార్తికేయ మొదటి చిత్రంతోనే సంచలన విజయం అందుకున్నాడు. అయితే ఆ తర్వాత ఈ హీరో నటించిన ఏ చిత్రం కూడా సక్సెస్ కాలేదు. తాజాగా కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు గీతా ఆర్ట్స్ 2 సంస్థ వాళ్ళు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. తాజాగా ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించారు, ఇక ఈ చిత్రంలో హీరోగా కార్తికేయ నటించనున్నాడు.

ఈ చిత్రానికి చావు కబురు చల్లగా అనే టైటిల్ పెట్టారు. కొత్త దర్శకుడు కౌశిక్ ని ఈ చిత్రంతో పరిచయం చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో హీరోగా నటించాలని కార్తికేయ ఎప్పటి నుండో అనుకుంటున్నాడు అయితే ఆ అవకాశం ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదు దాంతో చాలా సంతోషంగా ఉన్నాడు కార్తికేయ. ఇటీవలే ఈ హీరో నటించిన 90 ఎం ఎల్ చిత్రం విడుదల అయ్యింది అది కూడా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు దాంతో కంగారు పడుతున్న ఈ సమయంలోనే మెగా బ్యానర్ లో ఛాన్స్ వచ్చింది దాంతో ఉబ్బి తబ్బిబ్బై పోతున్నాడు కార్తికేయ.