చావు కబురు చల్లగా చెబుతున్న ఆర్ ఎక్స్ 100 హీరో

Published on Feb 13,2020 03:25 PM

ఆర్ ఎక్స్ 100 చిత్రంతో సంచలనం సృష్టించిన కార్తికేయ తాజాగా '' చావు కబురు చల్లగా '' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాని అల్లు అరవింద్ కు సంబందించిన ప్రొడక్షన్ హౌజ్ నిర్మించడం విశేషం. కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈరోజు నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో కార్తికేయ బస్తీ బాలరాజుగా నటిస్తున్నాడు.

రెగ్యులర్ షూటింగ్ మొదలు అయినట్లుగా పేర్కొంటూ ఓ పోస్టర్ ని విడుదల చేసారు ఆ చిత్ర బృందం. ఆర్ ఎక్స్ 100 చిత్రంతో హీరోగా పరిచయమైన కార్తికేయ మొదటి చిత్రంతోనే ప్రభంజనం సృష్టించాడు. అయితే ఆ తర్వాత ఈ హీరో నటించిన చిత్రాలేవీ ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోయాయి. ఈ సినిమా మెగా క్యాంప్ నుండి వస్తున్న సినిమా కాబట్టి కార్తికేయ చాలానే ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాతోనైనా కార్తికేయ హిట్ కొడతాడా చూడాలి.