100 కోట్ల క్లబ్ లో చేరిన కార్తీ

Published on Nov 12,2019 10:53 PM

తమిళ హీరో కార్తీ ఎట్టకేలకు ఇన్నాళ్లకు 100 కోట్ల క్లబ్ లో చేరాడు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఖైదీ చిత్రం తెలుగు , తమిళ భాషలలో మంచి విజయాన్ని నమోదు చేసింది. చాలాకాలంగా సరైన హిట్ లేక సతమతం అవుతున్న కార్తీకి ఖైదీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తమిళంలో పెద్ద హిట్ కాగా తెలుగులో కూడా మంచి వసూళ్లనే సాధించింది దాంతో ఈ సినిమాని కొన్న బయ్యర్లు లాభాల బాటలో పడ్డారు.

హీరోయిన్ , కామెడీ , డ్యూయెట్ లు లేకుండా విడుదలైన ఖైదీ కార్తీకి మర్చిపోలేని విజయాన్ని అందించింది. కంటెంట్ కరెక్ట్ గా ఉంటే సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో ఖైదీ రుజువు చేసింది. ఇక కార్తీ కి 100 కోట్లు సాధించిన సినిమాలు ఇప్పటివరకు లేవు కానీ ఆలోటుని ఈ ఖైదీ తీర్చాడు. ఇన్నాళ్లు వరుస ప్లాప్ లతో ఇబ్బంది పడుతున్న కార్తీ కి మార్కెట్ లేకుండాపోయింది కట్ చేస్తే ఖైదీ చిత్రంతో మళ్ళీ మంచి మార్కెట్ ఏర్పడుతోంది ఈ హీరోకు.