అనారోగ్యంతో బాధపడుతున్న నటి

Published on Feb 23,2019 03:10 PM

కన్నడ నటి విజయలక్ష్మి అనారోగ్యంతో బాధపడుతోంది . సినిమాల్లో , సీరియల్ లలో నటించింది విజయలక్ష్మి . అయితే ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది . అయితే చికిత్స కు అయ్యే డబ్బులు లేక ఆర్ధిక  ఇబ్బందుల్లో ఉంది విజయలక్ష్మి . కొద్దిరోజుల క్రితం విజయలక్ష్మి తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో చికిత్స నిమిత్తం పెద్ద మొత్తంలో ఖర్చు అయ్యిందట . 

అసలే విజయలక్ష్మి ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రమే ! దాంతో ఇప్పుడు విజయలక్ష్మి కి సరైన చికిత్స అందాలంటే డబ్బులు కావాలి , కానీ ఆమె దగ్గర డబ్బు లేదు పైగా మంచాన పడిఉంది అందుకే విజయలక్ష్మి చెల్లెలు ఆర్ధిక సహాయం కోసం విజ్ఞప్తి చేస్తోంది . విజయలక్ష్మి చెల్లెలు సహాయం కోసం అర్థిస్తోంది మరి కన్నడ చిత్ర బృందం స్పందిస్తుందా ? చూడాలి .