మహేష్ బాబు ని రిజెక్ట్ చేసిన కంగనా

Published on Mar 29,2019 12:28 PM

మహేష్ బాబు సరసన నటించే ఛాన్స్ వస్తే ఏమాత్రం మొహమాటం లేకుండా రిజెక్ట్ చేసి బాలీవుడ్ సినిమా చేసానని చెప్పి సంచలనం సృష్టించింది వివాదాస్పద భామ కంగనా రనౌత్ . అయితే ఈ భామ రిజెక్ట్ చేసిన సినిమా పోకిరి అప్పట్లో మహేష్ బాబు కు అంతగా క్రేజ్ లేదు అయితే ఒక్కడు సినిమాతో మహేష్ కెరీర్ ఒడ్డున పడింది కూడా అదే సమయంలో . పోకిరి సినిమా కోసం కంగనా రనౌత్ ని ఎంపిక చేసాడట దర్శకులు పూరి జగన్నాద్ . 

అయితే అదే సమయంలో బాలీవుడ్ లో గ్యాంగ్ స్టర్ సినిమా ఛాన్స్ రావడంతో మొదటి ప్రాధాన్యత గా బాలీవుడ్ చిత్రానికే ఓటు వేసింది మహేష్ సినిమాని రిజెక్ట్ చేసింది . కట్ చేస్తే పోకిరి ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టిన విషయం తెలిసిందే . పోకిరి చిత్రాన్ని రిజెక్ట్ చేసి తప్పు చేసింది కాబట్టే మరోసారి పూరి జగన్నాద్ దర్శకత్వంలో సినిమా అనగానే ఒప్పేసుకుంది కాకపోతే హీరో ప్రభాస్ సినిమా '' ఏక్ నిరంజన్ '' . ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది పాపం . దాంతో కంగనా ఆశలన్నీ అడియాసలయ్యాయి .