క్రిష్ ని విమర్శించిన కంగనా అక్క

Published on Jan 29,2019 12:40 PM

దర్శకులు క్రిష్ ని విమర్శిస్తూ పోస్ట్ చేసింది కంగనా రనౌత్ అక్క రంగోలి . మణికర్ణిక విజయాన్ని కంగనా ఆస్వాదిస్తోంది , ఆమెని అలా ఒంటరిగా వదిలేయండి . సక్సెస్ ని ఎంజాయ్ చేయనివ్వండి మీరు ప్రశాంతంగా కూర్చోండి అంటూ ట్వీట్ చేసింది . అంతేనా . మణికర్ణిక సినిమాకు మీరే దర్శకత్వం వహించారు నిజమే ! కానీ సినిమా మొత్తం కంగనా మాత్రమే కనబడుతోంది దానికి మేమేం చేయాలి అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించి క్రిష్ ని ఘోరంగా అవమానించింది . 

ఇప్పటికే కంగనా చెప్పిన విషయం ఏంటంటే ... క్రిష్ 30 శాతం చిత్రానికి మాత్రమే దర్శకత్వం వహించాడు మిగతా 70 శాతం నేనే దర్శకత్వం వహించాను అని . దాంతో క్రిష్ కంగనా పై విమర్శలు చేసాడు . వేరే వాళ్ళు చేసిన పనిని నేనే చేశాను అని చెప్పుకుంటున్న కంగనా కు అసలు నిద్ర ఎలా పడుతుందో ? అని విమర్శించడమే కాకుండా కంగనా రనౌత్ నన్ను ఘోరంగా అవమానించిందని పేర్కొన్నాడు . దాంతో ఈ వివాదం ఇలా పెద్దదయ్యింది .