హిట్టు కొట్టిన కంగనా రనౌత్ పంగా

Published on Jan 24,2020 09:36 PM

వివాదాస్పద భామ కంగనా రనౌత్ నటించిన పంగా హిట్ కొట్టింది. భారత కబడీ మాజీ ఛాంపియన్ జయ నిగమ్ బయోపిక్ గా తెరకెక్కిన చిత్రం '' పంగా ''. పెళ్లి చేసుకున్న ఓ మహిళ తన లక్ష్యం కోసం ఎలాంటి సాహసానికి ఒడిగట్టింది. కబడ్డీ ప్లేయర్ కావడానికి , ఛాంపియన్ గా అవతరించడానికి ఎన్ని కష్టాలు పడింది , వాటిని ఎదుర్కొని ఎలాంటి విజయాలను సాధించింది అన్న కథాంశంతో రూపొందిన పంగా చిత్రానికి విమర్శకుల ప్రశంసలు కూడా లభిస్తున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా పంగా చిత్రం ఈరోజు విడుదల అయ్యింది. అశ్విని అయ్యర్ తివారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కంగనా రనౌత్ , రిచా చద్దా , నీనా గుప్తా , పంకజ్ త్రిపాఠీ కీలక పాత్రల్లో నటించారు. బాలీవుడ్ లో బయోపిక్ లు ప్రభంజనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ అవుతూ వసూళ్ల వర్షం కురిపిస్తూనే మరోవైపు అవార్డులను కూడా తెచ్చిపెడుతున్నాయి. ఆ కోవలోనే ఈ పంగా చిత్రం కూడా చేరడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.