కమ్మరాజ్యంలో కడపరెడ్లు ట్రైలర్ వచ్చేసింది

Published on Oct 27,2019 11:46 AM
వివాదాస్పద దర్శకులు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కమ్మరాజ్యంలో కడప రెడ్లు ట్రైలర్ ని ఈరోజు విడుదల చేసారు. దీపావళి కానుకగా విడుదల చేసిన ఈ ట్రైలర్ సంచలనం సృష్టిస్తోంది. మరోసారి పెద్ద వివాదాన్ని రాజేసేలా ఉంది ఈ ట్రైలర్ . ట్రైలర్ లో చంద్రబాబు , జగన్ , మోడీ , అమిత్ షా , నారా లోకేష్ , నారా బ్రాహ్మణి తదితర పాత్రలను చూపించారు.
             ఇలా చూపించడం మరింత వివాదం కావడం ఖాయం అనిపిస్తోంది. తెలుగుదేశం శ్రేణులు వర్మ పై ఆగ్రహం వ్యక్తం చేయడం ఖాయం. ఇప్పటికే పలుమార్లు చంద్రబాబుని టార్గెట్ చేసాడు వర్మ. ఇక ఇపుడు మరోసారి బాబు ని టార్గెట్ చేసి ట్రైలర్ ని విడుదల చేసాడు. ఇప్పటికే చంద్రబాబు పార్టీ చిత్తుగా ఓడిపోయి ఉంది ఇలాంటి సమయంలో మరింతగా డ్యామేజ్ అయ్యేలా కనిపిస్తోంది ఈ కమ్మరాజ్యంలో కడపరెడ్లు ట్రైలర్ .