కమ్మరాజ్యంలో కడపరెడ్లు ట్రైలర్ ఎల్లుండే

Published on Oct 24,2019 12:43 PM

వివాదాస్పద దర్శకులు రాంగోపాల్ వర్మ కమ్మరాజ్యంలో కడపరెడ్లు చిత్ర ట్రైలర్ ఎల్లుండి విడుదల చేయబోతున్నట్లు ప్రకటించాడు. దీపావళి కానుకగా ఈ చిత్ర ట్రైలర్ ని విడుదల చేయనున్నాడు వర్మ. నిత్యం ఏదో ఒక వివాదాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు వర్మ తాజాగా కమ్మరాజ్యంలో కడపరెడ్లు చిత్రాన్ని వాడుకుంటున్నాడు వర్మ.
ఇప్పటికే కమ్మరాజ్యంలో కడప రెడ్లు అంటూ ఓ పాటని పాడటమే కాకుండా దాన్ని విడుదల చేసి సంచలనం సృష్టించాడు. ఇక ఇప్పుడేమో ట్రైలర్ తో ఆ వివాదాన్ని మరింతగా రాజేయడానికి వస్తున్నాడు. ఈ ట్రైలర్ తప్పకుండా వివాదాన్ని సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు , జగన్మోహన్ రెడ్డి ల పాత్రధారులతో కూడిన పోస్టర్ ని తాజాగా విడుదల చేసాడు మరి.