కమ్మరాజ్యంలో కడప రెడ్లు విడుదల ఆగిపోయింది

Published on Nov 29,2019 11:58 AM

కమ్మరాజ్యంలో కడప రెడ్లు చిత్రం విడుదల ఆగిపోయింది. వివాదాస్పద దర్శకులు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన కమ్మరాజ్యంలో కడప రెడ్లు ఈరోజు విడుదల కావాల్సి ఉంది అయితే టైటిల్ పట్ల మాత్రమే కాకుండా ఆ చిత్రంలో ఉన్న పాత్రలు చంద్రబాబు నాయుడు , జగన్ , నారా లోకేష్ , కే ఏ పాల్ లను పోలి ఉండటంతో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి దానికి తోడు సెన్సార్ కూడా పూర్తి కాలేదు దాంతో కమ్మరాజ్యంలో కడప రెడ్లు టైటిల్ ని '' అమ్మరాజ్యంలో కడప బిడ్డలు '' గా మార్చినప్పటికీ విడుదల కాలేదు.

ఈ విషయంపై వర్మ హైకోర్టు ని ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. వర్మ చిత్రంపై వస్తున్న అభ్యంతరాలను పరిశీలించి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని సెన్సార్ బోర్డు ని కోరింది హైకోర్టు. దాంతో ఈరోజు విడుదల ఆగిపోయింది. ఇక సెన్సార్ వాళ్ళు అన్ని అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని ఎప్పుడు నివేదిక ఇస్తారో ? సెన్సార్ ఎప్పుడు చేస్తారో