కరోనా సోకలేదంటున్న కమల్ హాసన్

Published on Mar 29,2020 05:21 PM
నాకు కరోనా సోకలేదు అంటూ వివరణ ఇచ్చాడు ప్రముఖ హీరో కమల్ హాసన్. కొద్దిరోజుల క్రితం విదేశాలకు వెళ్ళొచ్చాడు కమల్ దాంతో ఇండియా రాగానే క్వారంటైన్ లో ఉండాలి కాబట్టి అందుకు అనుగుణంగా చెన్నై లోని పాత ఇంట్లో ఉండకుండా దూరంగా ఓ ఇంట్లో ఉంటున్నాడు. అయితే కమల్ పాత ఇంట్లోనే ఉంటున్నాడు అనుకొని ఆ ఇంటికి క్వారంటైన్ స్టిక్కర్ అంటించారు. ఇంకేముంది క్వారంటైన్ స్టిక్కర్ అంటించడంతో కమల్ కు కరోనా వచ్చిందని పుకార్లు షికారు చేసాయి.

దాంతో స్పందించాడు కమల్ , నేను ఆ ఇంట్లో ఉండటం లేదు నాకు కరోనా సోకలేదు అంటూ వివరణ ఇవ్వడంతో షాక్ తిన్నారు అధికారులు. సోషల్ డిస్టెన్స్ పాటించాలి కాబట్టి నేను మరో ఇంట్లో దూరంగా ఉంటున్నాను నేనే కాదు ప్రతీ ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటించాలి అంటూ ఓ లేఖ విడుదల చేసాడు కమల్ హాసన్. కరోనా వచ్చిందన్న పుకార్లు ఇలా కమల్ లేఖతో సైలెంట్ అవ్వడం ఖాయం.