కళ్యాణ్ రామ్ డబ్బులు తీసుకోకుండా నటించాడట

Published on Feb 28,2019 03:25 PM

బాబాయ్ నందమూరి బాలకృష్ణ నటించి నిర్మించిన ఎన్టీఆర్ కథానాయకుడు , ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాల్లో కళ్యాణ్ రామ్ నటించిన విషయం తెలిసిందే . అయితే రెండు సినిమాల్లో నటించినప్పటికీ ఒక్క పైసా కూడా తీసుకోలేదట . అయితే బాలయ్య బాబాయ్ రెమ్యునరేషన్ తీసుకోమని ఎంతగా బలవంతం చేసినప్పటికీ తాతగారి సినిమా అందునా నాన్నగారి పాత్రలో నటించడమే గొప్ప ! ఇంకా డబ్బులు తీసుకోవడమా ! వద్దు బాబాయ్ అంటూ మొహమాటం లేకుండా చెప్పాడట నందమూరి కళ్యాణ్ రామ్ . 

ఎన్టీఆర్ బయోపిక్ లో కళ్యాణ్ రామ్ హరికృష్ణ పాత్రలో నటించిన విషయం తెలిసిందే . అయితే ఎన్టీఆర్ బయోపిక్ ఘోర పరాజయాన్ని మిగిల్చింది . తాజాగా కళ్యాణ్ రామ్ నటించిన 118 చిత్రం రేపు విడుదల అవుతోంది . మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.