పండగ పూట ప్లాప్ కొట్టిన కళ్యాణ్ రామ్

Published on Jan 15,2020 06:15 PM

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ఎంత మంచి వాడవురా అనే చిత్రం విడుదల అయ్యింది ఈరోజు. సంక్రాంతి పండగ సందర్బంగా విడుదలైన ఎంత మంచి వాడవురా చిత్రానికి ప్లాప్ టాక్ వచ్చింది. కుటుంబ కథా చిత్రాల దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించగా మెహరీన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ చిత్రంలో సపోర్టింగ్ క్యారెక్టర్ లలో బోలెడు మంది ఆర్టిస్ట్ లు నటించారు. భారీ తారాగణంతో ఈ చిత్రం తెరకెక్కింది.

పండగ పూట అందునా ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న చిత్రం కావడంతో తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకంతో విడుదల చేసారు. ఒకవైపున రజనీకాంత్ , మహేష్ బాబు , అల్లు అర్జున్ ల చిత్రాలు పోటీలో ఉన్నప్పటికీ పండగ కదా అని అత్యుత్సాహంతో విడుదల చేసారు కానీ కళ్యాణ్ రామ్ కు ఇది దెబ్బె అని చెప్పాలి. ఎందుకంటే ఎంత మంచి వాడవురా చిత్రానికి ప్లాప్ టాక్ వచ్చేసింది.