అయ్యో ! బాలయ్యా ......

Published on Feb 26,2019 11:39 AM

నటసింహం నందమూరి బాలకృష్ణ వెండితెర మీద పవర్ ఫుల్ డైలాగ్స్ తో హోరెత్తిస్తాడు కానీ బహిరంగ సమావేశాల్లో మాత్రం అంతగా రాణించలేడు అంతేకాదు సరిగ్గా మాట్లాడలేడు కూడా . బాలయ్య మాట్లాడుతుంటే తప్పనిసరిగా ఏదో ఒక తప్పు దొర్లుతూనే ఉంటుంది దాంతో సోషల్ మీడియాలో ఓ రేంజు లో ఆడుకుంటుంటారు బాలయ్య యాంటీ ఫ్యాన్స్ . నిన్న 118 చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో జరిగింది కాగా ఆవేడుకకు బాలయ్య తో పాటు ఎన్టీఆర్ కూడా హాజరయ్యాడు . 

అయితే 118 సినిమా టైటిల్ ని పొరపాటుగా 189 అంటూ పలికాడు బాలయ్య , దాంతో ఖంగుతిన్న అబ్బాయిలు ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ లు 189 కాదు 118 అని చెప్పినప్పటికీ మర్చిపోయి 189 అంటూ మూడుసార్లు అలాగే పలికాడు . దాంతో మిన్నకుండిపోయారు అబ్బాయిలు . 


వీడియోని చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి