ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటానంటున్న కాజల్

Published on Oct 29,2019 11:58 AM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ కావడంతో అతడ్ని పెళ్లి చేసుకుంటానని అంటోంది హీరోయిన్ కాజల్ అగర్వాల్. తాజాగా ఈ భామ మంచు లక్ష్మి నిర్వహిస్తున్న ఓ షోలో పాల్గొనగా అందులో రకరకాల విషయాలపై తడుముకోకుండా మాట్లాడి చురుకైన సమాధానాలు ఇచ్చింది. ఇక ఎన్టీఆర్ , రాంచరణ్ , ప్రభాస్ లలో ఎవరిని పెళ్లి చేసుకుంటావ్ అని మంచు లక్ష్మి అడగగా టక్కున ప్రభాస్ అని చెప్పేసింది కాజల్ అగర్వాల్.
              జూనియర్ ఎన్టీఆర్ , రాంచరణ్ , ప్రభాస్ ఈ ముగ్గరు హీరోలతో కూడా నటించింది కాజల్ అయితే ఎన్టీఆర్ కు అలాగే రాంచరణ్ కు ఆల్రెడీ పెళ్లిళ్లు అయ్యాయి కాబట్టి ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటానని సమాధానం ఇచ్చింది. ఈ సమాధానం తో పాపం ! అనుష్క కు ఇబ్బందే మరి.