షూటింగ్ అంటే భయపడుతున్న కాజల్

Published on Feb 28,2020 03:23 PM

కాజల్ అగర్వాల్ షూటింగ్ అంటే భయపడుతోంది. భారతీయుడు 2 షూటింగ్ లో భారీ ప్రమాదం జరగడం , ఆ భారీ ప్రమాదం జరిగినప్పుడు పక్కనే ఉండటంతో కాళ్ళు చేతులు వణికిపోతున్నాయట ఇప్పటికి కూడా. షూటింగ్ అంటే చాలు నిలువెల్లా కంపించిపోతోందట అందుకే ఇప్పట్లో షూటింగ్ కి వచ్చేది లేదని కరాఖండిగా చెప్పేసిందట కాజల్ అగర్వాల్. కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న భారతీయుడు 2 చెన్నైలో షూటింగ్ జరుగుతున్న సమయంలో ప్రమాదం జరిగి ముగ్గురు చనిపోయిన సంగతి తెలిసిందే.

షూటింగ్ అంటే ఇన్నాళ్లు సంతోషంగా ఉండేది కానీ ఈ సంఘటన కళ్ళ ముందే జరిగాక షూటింగ్ అంటే మాత్రం చాలా భయపడిపోతోంది కాజల్ అగర్వాల్. దాంతో ఇప్పట్లో షూటింగ్ కి హాజరయ్యేది లేదని లైకా ప్రొడక్షన్స్ వాళ్లకు చెప్పిందట. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నాక అప్పుడు షూటింగ్ కి వెళ్లనుంది. ఇక చావు వరకు వెళ్లి రావడంతో వెంటనే పెళ్లి చేయాలనే ఆలోచన ఇంట్లో వాళ్లకు వచ్చిందట ! అలాగే కాజల్ అగర్వాల్ కు కూడా పెళ్లి మీద గాలి మళ్లిందట.