పేరేమో సీత కానీ వేషాలు మాత్రం .......

Published on Apr 01,2019 11:04 AM

పేరు సీత కానీ ఆమె వేసే వేషాలు మాత్రం శూర్పణఖని మించిపోయాయి . ఇంతకీ  సీత పేరు పెట్టుకొని శూర్పణఖ వేషాలు వేస్తున్న  ఆ సీత ఎవరో తెలుసా ...... కాజల్ అగర్వాల్ . అవును కాజల్ అగర్వాల్ , బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , సోనూ సుద్  ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సీత . తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 25 న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . 

కాజల్ అగర్వాల్ పాత్రని అల్ట్రా మోడ్రన్ గా తీర్చిదిద్దాడు దర్శకులు తేజ దాంతో పెద్దగా వివాదం రాదు కానీ ఆ క్యారెక్టర్ కు సీత అనే పేరు పెట్టాడు దాంతో తప్పకుండా వివాదం చెలరేగేలా కనిపిస్తోంది . ఇక నిన్న సీత టీజర్ రిలీజ్ అయ్యింది . టీజర్ చూస్తుంటేనే ఈ సినిమా ఎలా ఉండబోతోందో అర్ధం అవుతూనే ఉంది . ఇంకా వివాదాలు చుట్టముట్టడం ఖాయంగా కనిపిస్తోంది .