మాల్దీవులలో ఎంజాయ్ చేస్తున్న కాజల్ అగర్వాల్

Published on Dec 24,2019 08:53 AM

హీరోయిన్ కాజల్ అగర్వాల్ మాల్దీవులలో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది. పీకల్లోతు ప్రేమలో మునిగిన ఈ భామ బయటకు మాత్రం నేనెవరినీ ప్రేమించడం లేదు అని బుకాయిస్తోంది. ఓ వ్యాపారవేత్త తో ప్రేమలో పడిన ఈ భామ గ్యాప్ దొరికితే చాలు అతడితో వివిధ ప్రదేశాలను చుట్టేస్తోంది. తాజాగా మాల్దీవులకు వెళ్ళింది కాజల్ అగర్వాల్. అక్కడ టు పీస్ బికినీ లో అందాలను ఆరబోస్తూ రకరకాల భంగిమల్లో ఫోటోలకు ఫోజిచ్చింది. ఇక ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాజల్ అగర్వాల్ బికినీ లో అందాలను ఆరబోసింది పెద్దగా లేదు ఇంతకుముందు కానీ ఇప్పుడు మాత్రం వీర లెవల్లో రెచ్చిపోతోంది. దక్షిణాదిన పలు భాషలలో నటిస్తున్న ఈ భామ పెళ్లి వయసుకు వచ్చింది కానీ అప్పుడే పెళ్లా ? అని బుంగమూతి పెట్టింది ఇన్నాళ్లు. ఇక ఇప్పుడేమో పెళ్ళెప్పుడు అవుతుందా ? అని ఆశగా ఎదురు చూస్తున్నట్లుంది. చెల్లెలు ఎప్పుడో పెళ్లి చేసుకుంది పిల్లలను కూడా కన్నది. 34 ఏళ్ల కాజల్ ఇక పెళ్లి చేసుకోవడమే తరువాయి అని తెలుస్తోంది.