2 లక్షల విరాళం ఇచ్చిన కాజల్ అగర్వాల్

Published on Apr 16,2020 06:54 PM
హీరోయిన్ కాజల్ అగర్వాల్ కరోనా క్రైసిస్ చారిటి కి 2 లక్షల విరాళం అందించింది. ఆర్టీజిఎస్ ద్వారా 2 లక్షల విరాళం అందించింది కాజల్. మెగాస్టార్ చిరంజీవి అధ్యక్షతన కరోనా చారిటీ క్రైసిస్ ఏర్పడిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారితో షూటింగ్ లన్ని ఆగిపోయాయి. దాంతో వేలాదిమంది సినీ కార్మికులు పనిలేక అవస్థలు పడుతున్నారు దాంతో వాళ్ళని ఆదుకోవడానికి కరోనా క్రైసిస్ చారిటీ ని స్థాపించారు.

ఇప్పటికే ఈ సంస్థకు పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చారు పలువురు హీరోలు . అయితే ఇంకా కొంతమంది హీరోలు ఇవ్వాల్సి ఉంది కానీ వాళ్ళు ఇంకా స్పందించలేదు. వాళ్ళ విషయాన్నీ పక్కన పెడితే హీరోయిన్ లు మాత్రం పెద్దగా స్పందించలేదు. ప్రణీత , లావణ్య , రకుల్ ఇలా కొంతమంది మాత్రం స్పందించారు. అయితే కాస్త ఆలస్యమైనా కాజల్ 2 లక్షల విరాళం ప్రకటించింది.