గజగజ వణికిపోతున్న కాజల్ అగర్వాల్

Published on Feb 21,2020 01:43 PM

కాజల్ అగర్వాల్ గజగజ వణికిపోతోంది. అదృష్టం బాగుండబట్టి కొద్దిలో మిస్ అయ్యిందని లేదంటే దారుణం జరిగి ఉండేదని బాధపడుతోంది , భయపడుతోంది కాజల్ అగర్వాల్. కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో భారతీయుడు 2 చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఆ సినిమా షూటింగ్ లో భారీ ప్రమాదం జరిగి ముగ్గురు వ్యక్తులు మరణించగా పదిమందికి పైగా గాయాల పాలయ్యారు.

అయితే భారీ క్రేన్ పడే సమయానికి కేవలం 2 నిమిషాల ముందు మరో టెంట్ లోకి వెళ్లి కూర్చున్నారట కమల్ హాసన్ , కాజల్ అగర్వాల్ . ఆ టెంట్ లో కూర్చొని మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా ఆర్తనాదాలు మిన్నంటడంతో ఏం జరిగిందో అని బయటకు వచ్చి చూసి నిలువెల్లా వణికిపోయిందట కాజల్ అగర్వాల్. పాపం ఆ భారీ ప్రమాదాన్ని దగ్గర నుండి చూడటంతో షాక్ అయ్యిందట. ఆమె తేరుకోవడానికి చాలా సమయమే పట్టిందట. ఇంకా నూకలు ఉన్నాయి కాబట్టే బ్రతికిపోయానని లేదంటే ఈ జీవితం ఇంతేనా అని కుమిలి కుమిలి ఏడుస్తోందట కాజల్ అగర్వాల్. ఇప్పట్లో షూటింగ్ లో పాల్గొనడం కష్టమే అని అంటున్నారు కాజల్ సన్నిహితులు.