80 కోట్ల వసూళ్లతో సంచలనం సృష్టిస్తున్న ఖైదీ

Published on Nov 07,2019 04:13 PM
తమిళ స్టార్ హీరో కార్తీ నటించిన ఖైదీ కేవలం 12 రోజుల్లోనే 80 కోట్ల గ్రాస్ వసూళ్ళని వరల్డ్ వైడ్ గా సాధించి సంచలనం సృష్టిస్తోంది. 12 రోజుల తర్వాత కూడా తమిళనాట ఇంకా స్ట్రాంగ్ గా కొనసాగుతోంది దాంతో 100 కోట్ల పైచిలుకు గ్రాస్ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఒక్క తమిళ వెర్షన్ మాత్రమే 80 కోట్లకు పైగా వసూళ్ళని సాధించింది. తమిళ దర్శకులు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఖైదీ చిత్రానికి ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నారు. 

ఇక తెలుగులో కూడా ఈ చిత్రం మంచి వసూళ్ళని సాధించింది. ఈ సినిమాని కొన్న బయ్యర్లు ఇప్పటికే మంచి లాభాలను పొందారు. గతకొంత కాలంగా కార్తీ కి సాలిడ్ హిట్ లేకుండాపోయింది. ఆ లోటుని చాలా రోజుల తర్వాత ఖైదీ తీర్చింది. దాంతో కార్తీ తో పాటుగా కార్తీ అభిమానులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు.