మంచి వసూళ్ళని సాధిస్తున్న ఖైదీ

Published on Oct 29,2019 03:43 PM

తమిళ హీరో కార్తీ నటించిన ఖైదీ చిత్రం తెలుగులో మంచి వసూళ్ల ని సాధిస్తోంది. గతకొంత కాలంగా కార్తీ నటించిన చిత్రాలన్నీ ఘోరంగా పరాజయం పొందుతూనే ఉన్నాయి దాంతో ఖైదీ చిత్రంపై పెద్దగా అంచనాలు లేకుండా పోయాయి. అందువల్ల ఈ సినిమా బాగున్నప్పటికీ మొదటి రోజున పెద్దగా కలెక్షన్లు లేకుండా పోయాయి. కట్ చేస్తే టాక్ బాగా స్ప్రెడ్ కావడంతో 3 రోజుల్లోనే 2 కోట్ల 50 లక్షల షేర్ సాధించింది.

మొత్తానికి ఇన్నాళ్ల తర్వాత ఖైదీ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు కార్తీ. ఇక ఈ సినిమాని కొన్న వాళ్లకు బాగానే లాభాలు వచ్చేలా ఉన్నాయి ఎందుకంటే మంచి వసూళ్లు వస్తున్నాయి ఇందుకు కారణం కూడా ఉంది . గతకొంత కాలంగా ప్లాప్ లతో ఈ సినిమాని తక్కువకు అమ్మారు కట్ చేస్తే మంచి హిట్ అయ్యింది అలాగే మంచి కలెక్షన్లని సాధిస్తోంది ఖైదీ చిత్రం.