రాజమౌళి ఫోటోని షేర్ చేసిన జూనియర్ ఎన్టీఆర్

Published on Aug 28,2019 11:26 AM

జూనియర్ ఎన్టీఆర్ తాజాగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ షెడ్యూల్ బల్గేరియాలో షూటింగ్ జరుపుకుంటోంది. దాంతో జూనియర్ ఎన్టీఆర్ , రాజమౌళి తదితరులతో పాటుగా యూనిట్ మొత్తం బల్గేరియా వెళ్ళింది. అక్కడ షూటింగ్ సమయంలో రాజమౌళి ఓ చెక్క లాంటి తుపాకీ ని పట్టుకొని తీక్షణంగా చూస్తున్న ఫోటోని క్లిక్ మనిపించాడు ఎన్టీఆర్. 

ఇక ఆ ఫోటోని తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసి పండగ చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఎస్ ఎస్ రాజమౌళి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ విషయానికి వస్తే ....... దాదాపు నాలుగు వారాల పాటు అక్కడ షూటింగ్ జరుగనుంది. ఈనెల రోజుల పాటు ఎన్టీఆర్ పై భారీ యాక్షన్ సీన్స్ చిత్రీకరించనున్నారు రాజమౌళి.