ఎన్టీఆర్ అందుకు సిద్దమేనా ?

Published on Mar 05,2019 02:45 PM
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలంగాణ తెలుగుదేశం పార్టీ పగ్గాలు అందుకోవడం ఖాయమని తెలుస్తోంది కాకపోతే అది ఇప్పుడు కాదు బహుషా 2023 లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కావచ్చు లేదంటే 2027 లో కావచ్చు అని తెలుస్తోంది . ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరిస్థితి తెలంగాణలో దయనీయంగా ఉంది . ఒకప్పుడు అధికారం వెలగబెట్టిన ఆ పార్టీ కాలక్రమంలో వెలవెలబోతోంది . 
అయితే ఆ పార్టీకి తెలంగాణలో జవసత్వాలు అందించడానికి ఎన్టీఆర్ కు పగ్గాలు అప్పగించడం తప్పనిసరి అయ్యింది . అయితే ఎన్టీఆర్ కెరీర్ పీక్స్ లో ఉన్న ఈ సమయంలో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం అయితే లేదు కాకపోతే 2023 లేదా ఆ తర్వాత రావచ్చు అని తెలుస్తోంది . తెలుగుదేశం పార్టీ తాత పెట్టిన పార్టీ , నాన్న హరికృష్ణ చైతన్య రథసారథి గా నడిపించిన పార్టీ కావడంతో జూనియర్  ఎన్టీఆర్ కు రాజకీయాల్లోకి రావడం తప్పనిసరి కాకపోతే కొంతకాలం ఆగాలి మరి.