ఎన్టీఆర్ కూడా రిజెక్ట్ చేసాడట

Published on Mar 07,2019 04:46 PM

దర్శకులు సుకుమార్ - ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో '' నాన్నకు ప్రేమతో '' అనే సూపర్ హిట్ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే . దాంతో తారక్ తో సుకుమార్ కు మంచి ర్యాపొ ఉండటం వల్ల మళ్ళీ మనిద్దరం కలిసి సినిమా చేద్దాం , ఇప్పుడే మీడియాకు అనౌన్స్ చేద్దామని సుకుమార్ అడిగాడట ఎన్టీఆర్ ని కానీ ఇప్పుడు ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ చిత్రం చేస్తుండటంతో ఆ సినిమా పూర్తయ్యే వరకు , జక్కన్న నన్ను వెళ్ళిపో అనేంత వరకు మరో సినిమా గురించి ఆలోచించేది లేదని స్పష్టం చేసాడట . 

దాంతో సుకుమార్ నిరాశతో వెనుదిరిగాడట. మహేష్ బాబు - సుకుమార్ ల కాంబినేషన్ లో సినిమా రావాల్సి ఉండే కానీ అది క్యాన్సిల్ అయ్యింది దాంతో ఎన్టీఆర్ దగ్గరకు వెళ్ళాడట . ఎన్టీఆర్ రిజెక్ట్ చేయడంతో అల్లు అర్జున్ దగ్గరకు అల్లు అర్జున్ ఓకే చేయడం జరిగిపోయింది . ఆర్య వంటి బ్లాక్ బస్టర్ అల్లు అర్జున్ కు ఇచ్చాడు సుకుమార్ దాంతో తన తదుపరి సినిమా సుకుమార్ తో చేయనున్నాడు అల్లు అర్జున్ .