సొంత చిత్ర నిర్మాణానికి సిద్ధం అవుతున్న ఎన్టీఆర్

Published on Nov 11,2019 11:32 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సొంత చిత్ర నిర్మాణానికి సిద్ధం అవుతున్నాడు. ఇన్నాళ్లు బయటి నిర్మాతలకు సినిమాలు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తన ఆలోచనా విధానాన్ని మార్చుకోవడానికి నిర్ణయించుకున్నాడట. ఎందుకంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అలాగే ఒకవైపు నటిస్తూనే మరోవైపు చిత్ర నిర్మాణం చేయడం వల్ల అధిక లాభాలు పొందవచ్చు అని భావిస్తున్నాడట ఎన్టీఆర్.

తెలుగులో ఇప్పటికే ఎన్టీఆర్ , అక్కినేని , కృష్ణ , కృష్ణంరాజు , మోహన్ బాబు , చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ , మహేష్ బాబు , పవన్ కళ్యాణ్ , రాంచరణ్ తదితరులు సొంత చిత్ర నిర్మాణం చేసారు. ఒకవైపు నటిస్తూనే మరోవైపు చిత్రనిర్మాణాల్లో పెట్టుబడులు పెట్టారు.  ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది అందుకే వాళ్ళ జాబితాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా చేరనున్నాడట.