వైజాగ్ లో జూనియర్ ఎన్టీఆర్

Published on Dec 10,2019 05:06 PM
జూనియర్ ఎన్టీఆర్ వైజాగ్ లో అపూర్వ స్వాగతం లభించింది. ఆర్ ఆర్ ఆర్ చిత్రం షూటింగ్ కోసం హైదరాబాద్ నుండి వైజాగ్ వెళ్ళడానికి సిద్దమయ్యాడు ఎన్టీఆర్. అయితే ఎన్టీఆర్ ప్రోగ్రాం గురించి పెద్దగా ఎవరికీ తెలియకపోయినా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి వైజాగ్ వెళ్తున్నాడన్న విషయం వెంటనే వైజాగ్ లో తెలియడంతో అక్కడ ఎన్టీఆర్ దిగే లోపునే పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి తరలివచ్చారు ఎన్టీఆర్ అభిమానులు. ఎంతో ఆత్మీయంగా పలకరించడానికి ,ఆహ్వానించడానికి వచ్చిన అభిమానులను కాదనలేక హాయ్ చెప్పి అక్కడ నుండి లొకేషన్ కు వెళ్ళిపోయాడు ఎన్టీఆర్.


ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు హైదరాబాద్ లోనే షూటింగ్ జరిగింది , అయితే ఈరోజు నుండి వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ జరుగనుంది దాంతో ఎన్టీఆర్ వైజాగ్ చేరుకున్నాడు. ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరిస్ నటిస్తుండగా చరణ్ సరసన అలియా భట్ నటిస్తోంది. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు డివివి దానయ్య. ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రాంచరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నాడు.