మెగా హీరో కోసం ఎన్టీఆర్ వస్తున్నాడట

Published on Mar 27,2019 04:47 PM

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కోసం జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నాడట . సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం '' చిత్రలహరి ''. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సాయి తో పాటుగా సునీల్ , కళ్యాణి ప్రియదర్శన్ , నివేతా పేతురాజ్ లు నటిస్తున్నారు . ఇటీవలే టీజర్ తో అలరించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 12న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . 

కాగా రిలీజ్ కి ముందుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా చేయడం అలవాటు కాబట్టి ఆ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ ని ఆహ్వానించారట . మెగా హీరో సాయి కోసం అలాగే సునీల్ కోసం ఈ వేడుకకు ఎన్టీఆర్ రావడానికి ఒప్పుకున్నాడని సమాచారం . హిట్ కోసం పరితపించి పోతున్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తన పేరుని ''సాయి తేజ్'' గా మార్చుకున్నాడు . మరి ఈ మార్పుతోనైనా హిట్ కొడతాడా చూడాలి .