కొమరం భీం గా ఎన్టీఆర్

Published on Mar 14,2019 04:41 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటించనున్నాడు . బ్రిటిష్ ప్రభుత్వానికి , నైజాం నవాబుకు వ్యతిరేకంగా జంగ్ , జమీన్ , అంటూ గిరిజన పుత్రులను పోరాటం వైపునకు తిప్పిన అసలు సిసలైన పోరాట యోధుడు కొమరం భీమ్ కాగా ఆ పాత్రని ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ పోషిస్తున్నాడు . కొమరం భీమ్ కూడా నైజాం నవాబ్ తో పోరాటం చేసే ముందు ఏం చేసాడు ? ఎక్కడ ఉన్నాడు అన్నది ఇప్పటికి కూడా మిస్టరీ నే ! దాంతో ఆ కథాంశాన్ని ఎంచుకుని జక్కన చేస్తున్న చిత్రం '' ఆర్ ఆర్ ఆర్ ''. 

రాంచరణ్ అల్లూరి సీతారామరాజు కాగా ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటించనున్నారు . ఈ ఇద్దరు పోరాట యోధులు చేసిన అసలైన పోరాటం ఏంటి ? అన్న ఊహాజనిత కథతో ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు . 2020 జులై 30 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .