వర్మ బయోపిక్ పై దృష్టి పెట్టిన జొన్నవిత్తుల

Published on Dec 04,2019 01:08 PM

వివాదాస్పద దర్శకులు రాంగోపాల్ వర్మ పై చెత్త బయోపిక్ తీయాలనే దృష్టి తో ఉన్నాడు ప్రముఖ రచయిత జొన్నవిత్తుల. కొద్దిరోజుల క్రితం రాంగోపాల్ వర్మ -జొన్నవిత్తుల మధ్య తీవ్ర విబేధాలు నెలకొన్నాయి. జొన్నవిత్తుల ని పప్పు తో పోల్చడమే కాకుండా ఘోరంగా అవమానించాడు వర్మ. దాంతో జొన్నవిత్తుల తీవ్ర ఆగ్రహానికి లోనై రాంగోపాల్ వర్మ పై చెత్త బయోపిక్ చేస్తానని సవాల్ చేసాడు. కట్ చేస్తే ఆ బయోపిక్ కు రంగం సిద్ధం చేస్తున్నాడు జొన్నవిత్తుల.

ఉత్తరాది నుండి వర్మ ని పోలిన ఓ వ్యక్తిని తీసుకొచ్చి హైదరాబాద్ లో శిక్షణ ఇప్పిస్తున్నాడట జొన్నవిత్తుల. మరోవైపు స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతోందట. త్వరలోనే వర్మ బయోపిక్ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఇగో హర్ట్ అయితే ఎలా ఉంటుందో జొన్నవిత్తుల నిరూపిస్తున్నాడు.