డ్యాన్స్ మాస్టర్ జానీ కి జైలు శిక్ష

Published on Mar 28,2019 10:50 AM

తెలుగు చిత్రాలకు డ్యాన్స్ మాస్టర్ గా పనిచేసిన జానీ మాస్టర్ కు జైలు శిక్ష పడింది . ఆరు నెలల జైలు శిక్ష తో పాటుగా 1000 రూపాయల జరిమానా కూడా విధించారు మేడ్చల్ ఏ ఎస్ జె న్యాయమూర్తి . సంఘటన వివరాలలోకి వెళితే ......... షేక్ జానీ పాషా తన అనుచరులతో కలిసి 2014 లో మరో డ్యాన్స్ గ్రూప్ తో గొడవ పడ్డాడు . ప్రత్యర్థి గ్రూప్ పై దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన ప్రత్యర్థి డ్యాన్స్ గ్రూప్ కేసు పెట్టారు . 

దాంతో జానీ మాస్టర్ పై కేసు పెట్టిన పోలీసులు కోర్టు కి లాగడంతో వాదోపవాదాలు విన్న తర్వాత జానీ మాస్టర్ తప్పు తేలడంతో ఆరు నెలల జైలు శిక్ష విధించింది మేడ్చల్ కోర్టు . తెలుగులో పలువురు స్టార్ హీరోల చిత్రాలకు డ్యాన్స్ మాస్టర్ గా పనిచేసిన జానీ కొంతకాలం జైలు జీవితం గడపకతప్పదు .