బిగ్ బాస్ 3 విన్నర్ పై అసంతృప్తి వ్యక్తం చేసిన ఝాన్సీ

Published on Nov 06,2019 02:33 PM

బిగ్ బాస్ 3 విన్నర్ గా సింగర్ రాహుల్ సింప్లిగంజ్ ఎంపికైన విషయం తెలిసిందే. అయితే అతడి ఎంపిక పట్ల సంతోషం వ్యక్తం చేసేవాళ్లు ఉన్నారు అలాగే అదేస్థాయిలో విమర్శలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక తాజాగా యాంకర్ , నటి ఝాన్సీ బిగ్ బాస్ 3 విన్నర్ పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అమెరికా లాంటి అగ్ర దేశాల్లోనే మహిళను అధ్యక్షురాలిగా ఎన్నుకోలేకపోతున్నారు ఇక మన దగ్గర అది ఎలా సాధ్యం అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది.

ఇక తన పూర్తి మద్దతు శ్రీముఖికి తెలిపింది ఝాన్సీ. శ్రీముఖి మొదటి నుండి కూడా ప్రతీ టాస్క్ లో తన బెస్ట్ ఇచ్చిందని టైటిల్ మిస్ అయినప్పటికీ నా మద్దతు మాత్రం శ్రీముఖికే అంటూ స్టేట్ మెంట్ ఇచ్చేసింది. అంటే బిగ్ బాస్ విన్నర్ సరైన పద్దతిలో జరగలేదని వాపోతోంది అన్నమాట ఝాన్సీ.