జార్జ్ రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు

Published on Nov 17,2019 10:27 AM

ఉస్మానియా స్టూడెంట్ జార్జ్ రెడ్డి బయోపిక్ గా రూపొందిన చిత్రం జార్జ్ రెడ్డి. ఈ చిత్రం ఈనెల 22 న విడుదల అవుతున్న నేపథ్యంలో ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీ ఎత్తున ఏర్పాటు చేసారు పైగా ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ ముఖ్య అథితిగా ఆహ్వానించారు కూడా. పవన్ కూడా రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అయితే ఈ ఈవెంట్ కు పోలీసులు అనుమతి నిరాకరించారు దాంతో జార్జ్ రెడ్డి ఈవెంట్ రద్దు అయ్యింది.

ఈ ఈవెంట్ రద్దు కావడానికి కారణం ఏంటో తెలుసా ....... పెద్ద ఎత్తున స్టూడెంట్స్ తరలి వస్తే వాళ్ళని అదుపు చేయడం కష్టం అవుతుందని , ఏదైనా జరగరానిది జరిగితే పెద్ద నష్టం జరగొచ్చు కాబట్టి ఈ ఈవెంట్ ని రద్దు చేసుకోవాల్సిందిగా కోరారట పోలీసులు. దాంతో చేసేది లేక జార్జ్ రెడ్డి ఈవెంట్ ని రద్దు చేసారు ఆ చిత్ర బృందం. స్టూడెంట్స్ కోసం పోరాడిన జార్జ్ రెడ్డి ని 1972 లో అతి కిరాతకంగా చంపేశారు దుండగులు.