2 కోట్ల షేర్ సాధించిన జార్జి రెడ్డి

Published on Nov 28,2019 03:23 PM

సందీప్ మాధవ్ హీరోగా నటించిన జార్జి రెడ్డి నాలుగు రోజుల్లో 2 కోట్లకు పైగా షేర్ సాధించింది. నవంబర్ 22 న విడుదలైన జార్జి రెడ్డి చిత్రానికి మంచి ఓపెనింగ్స్ లభించాయి. ఉస్మానియా స్టూడెంట్ జార్జి రెడ్డి బయోపిక్ గా తెరకెక్కిన ఈ చిత్రం పై ట్రైలర్ విడుదలైన తర్వాత అంచనాలు పెరిగాయి. పైగా ఈ చిత్రానికి చిరంజీవి , పవన్ కళ్యాణ్ ల మద్దతు కూడా ఉండటంతో మంచి వసూళ్లు వచ్చాయి.

1972 లో జార్జి రెడ్డి ని అత్యంత పాశవికంగా హత్య చేసారు. అదే సంఘటనని ఆధారంగా చేసుకొని చేసిన ఈ చిత్రాన్ని 3 కోట్లకు అమ్మగా ఇప్పటికే నాలుగు రోజుల్లోనే 2 కోట్లకు పైగా షేర్ వచ్చింది. అంటే మరో కోటి రూపాయలు వస్తే బయ్యర్లు లాభాల బాటలోకి వస్తారు. దళం ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ జార్జి రెడ్డి బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకుపోతోంది. సందీప్ మాధవ్ జార్జి రెడ్డి పాత్రలోకి పరకాయప్రవేశం చేసాడు దాంతో అతడి పై ప్రశంసల వర్షం కురుస్తోంది.