జాను బాగానే ఉంది కానీ .....

Published on Feb 08,2020 12:46 PM

నిన్న విడుదలైన జాను చిత్రం విడుదల అయ్యింది , మంచి టాక్ కూడా వచ్చింది అయితే కలెక్షన్లు మాత్రం ఆ స్థాయిలో రాలేదు. తమిళంలో విజయం సాధించిన 96 చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసారు దిల్ రాజు. శర్వానంద్ హీరోగా నటించగా సమంత హీరోయిన్ గా నటించింది. తమిళ చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమార్ ఈ తెలుగు రీమేక్ కు దర్శకత్వం వహించడం విశేషం. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం బాగానే ఉన్నప్పటికీ 96 చిత్రాన్ని చూసిన వాళ్లకు మింగుడు పడేలా మాత్రం లేదు.

దాంతో కాబోలు లేక వచ్చే నెల నుండి వరుసగా పరీక్షలు ఉండటమో కానీ ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ లభించలేదు ఈ చిత్రానికి. అయితే టాక్ బాగానే ఉంది కాబట్టి మెల్లిగా కలెక్షన్లు పెరుగుతాయేమో అని ఆశగా ఎదురు చూస్తున్నాడు నిర్మాత దిల్ రాజు. మంచి కలెక్షన్లు వస్తే దిల్ రాజు మంచి ప్రయత్నమే చేసినట్లు లేదంటే నాని , సమంత , శర్వానంద్ చెప్పినట్లుగా క్లాసిక్ చిత్రాన్ని చెడగొట్టినట్లే అని చెప్పాలి. ఏంటి అన్నది మాత్రం మరో రెండు మూడు రోజుల్లో తేలనుంది.