వ్యభిచారం కేసులో అరెస్ట్ అయిన జబర్దస్త్ నటులు

Published on Mar 04,2020 04:20 PM

వ్యభిచారం కేసులో అడ్డంగా దొరికిపోయారు జబర్దస్త్ నటులు దొరబాబు , పరదేశీ. వైజాగ్ లోని మాధవ దారిలో వ్యభిచారం జరుగుతోందని పోలీసులకు పక్కా సమాచారం అందడంతో దాడులు నిర్వహించారు పోలీసులు. దాంతో ఆ దాడిలో జబర్దస్త్ లో హైపర్ ఆది టీమ్ లో నటించే దొరబాబుతో పాటుగా పరదేశీ కూడా దొరికాడు. దొరబాబు , పరదేశీలతో పాటుగా కొంతమంది మహిళలతో కలిపి మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేసారు పోలీసులు.

ప్రస్తుతం పోలీసుల విచారణ ఎదుర్కొంటున్నారు దొరబాబు , పరదేశీలు. హైపర్ ఆది టీమ్ లో దొరబాబు , పరదేశీ ఇద్దరు కూడా పార్టిసిపెంట్స్ అన్న సంగతి తెలిసిందే. ఇక దొరబాబు అయితే యూట్యూబ్ లో అసభ్యకరమైన కొన్ని చిత్రాల్లో కూడా నటించాడు. వాటిలోనే ఎక్కువగా ఫేమస్ అయ్యాడు దొరబాబు. ఇక ఇపుడేమో వ్యభిచారం చేస్తూ అడ్డంగా బుక్కయ్యాడు.