కరోనా సోకలేదంటున్న స్టార్ హీరో

Published on Mar 05,2020 02:26 PM

నాకు కరోనా వైరస్ సోకినట్లు ఊహాగానాలు వస్తున్నాయి అయితే అవన్నీ తప్పుడు వార్తలే ! నాకు కరోనా వైరస్ సోకలేదు అంటూ తేల్చి చెప్పాడు చైనా సూపర్ స్టార్ జాకీ చాన్ . బ్రూస్ లీ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఆ స్థాయి ఇమేజ్ ని సొంతం చేసుకున్న స్టార్ జాకీ చాన్ అన్న సంగతి తెలిసిందే. ఇక చైనాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుండటంతో పెద్ద మొత్తంలో వైరస్ బారిన పడ్డారు చైనీయులు దాంతో ఆ కోవలో జాకీ చాన్ కూడా ఉన్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. అయితే అవి ఎక్కువ కావడంతో స్పందించాడు జాకీ చాన్.

యావత్ ప్రపంచం కరోనా వైరస్ కు భయపడుతున్నారు. ఇప్పటికే 70 కి పైగా దేశాలు కరోనా వైరస్ బారిన పడ్డాయి. ఇక మనదేశంలో అందునా ఏపీ తెలంగాణలో కూడా వైరస్ బాధితులు బయటపడ్డారు. దాంతో మరింతగా భయపడుతున్నారు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ విదేశాలకు వెళ్లొచ్చిన వాళ్లతో కరోనా ఇండియాలోకి అడుగు పెట్టింది. ఇక మన సెలబ్రిటీలు కూడా కరోనా పట్ల జాగ్రత్తలు తీసుకోవాలంటూ సలహాలు ఇస్తున్నారు.