అనారోగ్య బారిన పడిన జబర్దస్త్ ఆర్టిస్ట్

Published on Nov 12,2019 05:42 PM

జబర్దస్త్ కార్యక్రమంలో ప్రేక్షకులను నవ్వించిన మిమిక్రి మూర్తి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గతకొంత కాలంగా లివర్ సమస్యతో బాధపడుతున్న మిమిక్రి మూర్తి ప్రస్తుతం వరంగల్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఆ చికిత్సకు లక్షలలో ఖర్చు అవుతుంది కానీ మూర్తి ఆర్ధికంగా అంతటి స్తొమత లేదు దాంతో దాతల నుండి విరాళాలు కోరుతున్నారు.

మిమిక్రి మూర్తి తెలుగులో పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలను పోషించాడు. అలాగే పలు టివి షోలలో పాల్గొన్నాడు. ఇక జబర్దస్త్ లో బాగానే నవ్వించాడు. కానీ కొంతకాలంగా జబర్దస్త్ లో పాల్గొనడం లేదు ఇదే సమయంలో తీవ్ర అనారోగ్యం మరింత ఆర్ధికంగా దెబ్బకొట్టింది. సహాయం కోసం ఎదురు చూస్తున్న మిమిక్రీ మూర్తి సహాయం అంది త్వరగా కోలుకోవాలని మనసారా కోరుకుందాం.